-రవాణా పేరుతో డబ్బులు అడిగితే 1912కు ఫిర్యాదు చేయండి…
హుజురాబాద్/ ఆగస్టు 05 ( మా అక్షరం): ఫెయిల్ అయిన పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్ల రవాణా పూర్తిగా ఉచితమని, రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్ పేరుతో వినియోగదారుల నుంచి ఎలాంటి నగదు వసూలు చేయడం లేదని హుజురాబాద్ డివిజనల్ ఇంజనీర్ లక్ష్మారెడ్డి బుధవారం ప్రకటన ద్వారాతెలిపారు. ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.విద్యుత్ శాఖ పరిధిలో ఫెయిల్ అయిన అన్ని పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లను శాఖ ఆధ్వర్యంలోనే అధికారిక వాహనాల ద్వారా తరలిస్తున్నామని చెప్పారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు లేదా ఇతరుల పేరుతో ఎవరైనా ట్రాన్స్‌ఫార్మర్ రవాణా కోసం డబ్బులు డిమాండ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించవద్దని సూచించారు.అలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే విద్యుత్ శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 1912కు ఫిర్యాదు చేయాలని కోరారు. అందిన ప్రతి ఫిర్యాదుపై శాఖ అత్యంత ప్రాధాన్యంతో విచారణ చేపట్టి, బాధ్యులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పారదర్శకమైన, అవినీతి రహిత సేవలందించేందుకు విద్యుత్ శాఖ కట్టుబడి ఉందని, అక్రమ వసూళ్లను అరికట్టడంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండి శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.













