+91 99635 77856

హుజురాబాద్ మున్సిపాలిటీ అక్రమాల పర్వంపై బీజేపీ సమరశంఖం

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజురాబాద్ మున్సిపాలిటీ అక్రమాల పర్వంపై బీజేపీ సమరశంఖం

-అర్హులకు కాకుండా అనర్హులకు, కాంగ్రెస్ విధేయులకు డబుల్ బెడ్రూమ్ ఇడ్ల కేటాయింపు...

-బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ధ్వజం...

హుజురాబాద్ ఆగస్టు 05 (మా అక్షరం): మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని,కాంగ్రెస్ విధేయులకే ఇళ్లు మంజూరు చేశారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం బిజెపి హుజూరాబాద్ మున్సిపల్ ఫ్లోర్, కౌన్సిలర్ లమీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... మున్సిపాలిటీ పాలన అవినీతికి అడ్డాగా మారిందని మండిపడ్డారు.నిజమైన నిరుపేదలు, అర్హులైన లబ్ధిదారులను పక్కనబెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లను కేటాయించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్హులైన పేదల హక్కులను కాలరాస్తూ, కేవలం అనర్హులకు అధికార కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నవారికే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేశారని ఆరోపించారు.పేద ప్రజలకు చెందాల్సిన ఇళ్లను అన్యాక్రాంతం చేస్తున్న అధికారుల తీరుపై బీజేపీ చూస్తూ ఊరుకోదని, త్వరలోనే బాధితులకు మద్దతుగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి సమరశంఖం పూరిస్తామని హెచ్చరించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇండ్లు వచ్చే వరకు పోరాటం ఆపేదిలేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి చైర్ పర్సన్ కనుమల విజయ, బిజెపి పట్టణ అధ్యక్షులు తుర్పాటి రాజు, హుజురాబాద్ బిజెపి కౌన్సిలర్లు కొలుగురి సుమలత, దామెర అనూష అనురాగ్, పంజాల మనోజ్, కొండ ప్రశాంతి, మంచి కట్ల మురళి, దామర అనురాగ్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-అర్హులకు కాకుండా అనర్హులకు, కాంగ్రెస్ విధేయులకు డబుల్ బెడ్రూమ్ ఇడ్ల కేటాయింపు…

-బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ధ్వజం…

హుజురాబాద్ ఆగస్టు 05 (మా అక్షరం): మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని,కాంగ్రెస్ విధేయులకే ఇళ్లు మంజూరు చేశారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం బిజెపి హుజూరాబాద్ మున్సిపల్ ఫ్లోర్, కౌన్సిలర్ లమీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ… మున్సిపాలిటీ పాలన అవినీతికి అడ్డాగా మారిందని మండిపడ్డారు.నిజమైన నిరుపేదలు, అర్హులైన లబ్ధిదారులను పక్కనబెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లను కేటాయించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్హులైన పేదల హక్కులను కాలరాస్తూ, కేవలం అనర్హులకు అధికార కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నవారికే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేశారని ఆరోపించారు.పేద ప్రజలకు చెందాల్సిన ఇళ్లను అన్యాక్రాంతం చేస్తున్న అధికారుల తీరుపై బీజేపీ చూస్తూ ఊరుకోదని, త్వరలోనే బాధితులకు మద్దతుగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి సమరశంఖం పూరిస్తామని హెచ్చరించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇండ్లు వచ్చే వరకు పోరాటం ఆపేదిలేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి చైర్ పర్సన్ కనుమల విజయ, బిజెపి పట్టణ అధ్యక్షులు తుర్పాటి రాజు, హుజురాబాద్ బిజెపి కౌన్సిలర్లు కొలుగురి సుమలత, దామెర అనూష అనురాగ్, పంజాల మనోజ్, కొండ ప్రశాంతి, మంచి కట్ల మురళి, దామర అనురాగ్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !