హుజూరాబాద్/ ఆగస్టు 05( మా అక్షరం) : ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పెద్దమ్మతల్లి బోనాల జాతర సందర్భంగా బుధవారం శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన పూజలు, బోనాల సమర్పణతో జాతర ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా సాగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు,ముదిరాజ్ కుల పెద్దలు,పోచమ్మ గుడి చైర్మన్,ఆలయ డైరెక్టర్లు,సంఘం నాయకులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Post Views: 11













