+91 99635 77856

మొలంగూర్ విద్యార్థినికి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో సీటు

Kudikala Sai Editor
maaksharamnews.in

మొలంగూర్ విద్యార్థినికి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో సీటు

శంకరపట్నం/ ఆగస్టు 06 (మా అక్షరం): మండలంలోని మొలంగూర్ గ్రామానికి చెందిన రానవేణి రాజు కుమార్తె సంకీర్తన ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి సీటు సాధించింది. విజయనగరంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో పాల్గొని ప్రవేశాన్ని ఖరారు చేసుకుంది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్ ప్రొ. శ్రీనివాసన్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది.అడ్మిషన్ ప్రక్రియలో అన్ని దశల్లో అండగా నిలిచిన బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్‌కు సంకీర్తన కృతజ్ఞతలు తెలిపింది.ఈ సందర్భంగా జక్కని సంజయ్‌కుమార్ మాట్లాడుతూ... మహాత్మా జ్యోతిరావు ఫూలే–సావిత్రిబాయి ఫూలే ఆశయాల స్ఫూర్తితో గ్రామీణ, పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు అవసరమైన మార్గదర్శనం, సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

శంకరపట్నం/ ఆగస్టు 06 (మా అక్షరం): మండలంలోని మొలంగూర్ గ్రామానికి చెందిన రానవేణి రాజు కుమార్తె సంకీర్తన ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి సీటు సాధించింది. విజయనగరంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో పాల్గొని ప్రవేశాన్ని ఖరారు చేసుకుంది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్ ప్రొ. శ్రీనివాసన్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది.అడ్మిషన్ ప్రక్రియలో అన్ని దశల్లో అండగా నిలిచిన బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్‌కు సంకీర్తన కృతజ్ఞతలు తెలిపింది.ఈ సందర్భంగా జక్కని సంజయ్‌కుమార్ మాట్లాడుతూ… మహాత్మా జ్యోతిరావు ఫూలే–సావిత్రిబాయి ఫూలే ఆశయాల స్ఫూర్తితో గ్రామీణ, పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు అవసరమైన మార్గదర్శనం, సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !