+91 99635 77856

దళితులను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

Kudikala Sai Editor
maaksharamnews.in

దళితులను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

-ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పొన్నాల శివాజీ....

హుజూరాబాద్/ సెప్టెంబర్ 08 (మా అక్షరం): దళితుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పొన్నాల శివాజీ విమర్శించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించి, వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.అసెంబ్లీలో దళిత స్పీకర్‌ను అవమానపరుస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, అయితే దళితుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని శివాజీ డిమాండ్ చేశారు.ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో గతంలో మొదటి విడతగా అందించిన దళిత బంధుతో పాటు రెండో విడతను కూడా పూర్తిస్థాయిలో అమలు చేసి దళితులను ఆదుకునే ప్రభుత్వమని నిరూపించుకోవాలని కోరారు. దళితుల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆయన ఎద్దేవా చేశారు.

Share ePaper Clip

Preparing image...

-ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పొన్నాల శివాజీ….

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !