+91 99635 77856

మహిళా ఎమ్మెల్యేలపై దాడి.. బీఆర్ఎస్ మహిళా నాయకుల ఆగ్రహం

Kudikala Sai Editor
maaksharamnews.in

మహిళా ఎమ్మెల్యేలపై దాడి.. బీఆర్ఎస్ మహిళా నాయకుల ఆగ్రహం

-షాద్‌నగర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మల దగ్ధం...

హుజురాబాద్/సెప్టెంబర్ 08 (మా అక్షరం): బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మహిళా నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. మహిళా ప్రజాప్రతినిధులపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు మార్గదర్శకత్వంలో, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆదేశాల మేరకు మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు.మహిళా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అనే గౌరవం కూడా చూడకుండా వారిపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మహిళా నాయకులు మండిపడ్డారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల దౌర్జన్యపూరిత వైఖరిని సహించేది లేదని హెచ్చరించారు.

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు తీవ్ర నిరసన

ఇదే సందర్భంగా కేసీఆర్‌పై షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మహిళా నాయకులు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు.షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్‌తో పాటు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. మహిళల ఆత్మగౌరవం, మహిళా ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడటంలో బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందని నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ మహిళా నాయకులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

-షాద్‌నగర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మల దగ్ధం…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !