+91 99635 77856

గద్దర్ మూడో వర్ధంతి సభను విజయవంతం చేయండి

Kudikala Sai Editor
maaksharamnews.in

గద్దర్ మూడో వర్ధంతి సభను విజయవంతం చేయండి

- తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శనిగరపు బాబ్జి పిలుపు..

హుజూరాబాద్ /సెప్టెంబర్ 09 (మా అక్షరం):ప్రజా యుద్ధ నౌక గద్దర్ మూడో వర్ధంతి సభను విజయవంతం చేయాలని తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శనిగరపు బాబ్జి పిలుపునిచ్చారు. ఈ నెల 10న హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య కళాకారులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో ప్రజలను ఉద్యమోన్ముఖులను చేసిన ఘనత గద్దర్‌కే దక్కుతుందన్నారు. గద్దర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, పీడిత ప్రజలు ఉన్నంతకాలం ఆయన జ్ఞాపకాలు, పాటలు ప్రజల గుండెల్లో నిలిచే ఉంటాయని పేర్కొన్నారు.​ఈ వర్ధంతి సభకు ముఖ్య అతిథులుగా చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల గద్దర్, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ చింతకింది కాశీం, జననాట్యమండలి వ్యవస్థాపక సభ్యులు కామ్రేడ్ సంజీవ్ హాజరవుతున్నట్లు తెలిపారు. వారితో పాటు స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ బాబు, సీనియర్ జర్నలిస్ట్ ఆవునూరు సమ్మయ్య, సీనియర్ న్యాయవాది ముక్కెర రాజు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య, ప్రజా నాస్తిక సమాజం జాతీయ అధ్యక్షుడు జీడి సారయ్య, ప్రొఫెసర్ బోరగాల రాజమోహన్ తదితరులు పాల్గొంటారని వివరించారు.​ఈ కార్యక్రమానికి రైతులు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ఉద్యమకారులు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని బాబ్జి విజ్ఞప్తి చేశారు.​ఈ సమావేశంలో కళాకారులు వడ్లకొండ అనిల్ కుమార్, పుల్ల వెంకన్న,రావుల తిరుపతి, ఎర్ర సురేష్, మేకల నవీన్, కడారి రాజకుమార్, బోడ వినోద్, ఆవునూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

– తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శనిగరపు బాబ్జి పిలుపు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !