+91 99635 77856

అట్టహాసంగా ఎస్‌జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

Kudikala Sai Editor
maaksharamnews.in

అట్టహాసంగా ఎస్‌జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

హుజూరాబాద్/సెప్టెంబర్ 09 (మా అక్షరం): హుజూరాబాద్ మండల స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్‌-14, అండర్‌-17 బాలబాలికల క్రీడా పోటీలు బుధవారం స్థానిక ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని క్రీడా పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించే క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఓటమి ఎదురైనా నిరాశ చెందకుండా, కెరటాల స్ఫూర్తితో పదేపదే లేచి విజయాన్ని అందుకునేందుకు ప్రయత్నించాలని అన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించి పోటీలను విజయవంతం చేయాలని కోరారు. ఎస్‌జీఎఫ్ మండల కార్యదర్శి చిరుత శ్రీనివాస్ మాట్లాడుతూ మూడు రోజులపాటు వివిధ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ పోటీల్లో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. దీంతో క్రీడా మైదానం విద్యార్థుల కేరింతలు, ఉత్సాహంతో సందడిగా మారింది.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, జడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. తిరుమల, మున్సిపల్ కౌన్సిలర్లు కోయల్కర్ భారతి బాలాజీ, ఇల్లందుల సమ్మయ్య, సందమల్ల పుణ్యబాబు, మ్యాకల స్వరూప తిరుపతి, టీజీ పీఈటీ గౌరవ అధ్యక్షుడు సొల్లు సారయ్య, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు వెంకట్‌రెడ్డి, రాజిరెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, హాకీ అసోసియేషన్ కార్యదర్శి బోడిగ తిరుపతి, మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పీడీలు, పీఈటీలు రేణుక, దూడ సత్యనందం, పి. రాజు, భాగ్యలక్ష్మి, కవిత, అనిల్, సాయి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజూరాబాద్/సెప్టెంబర్ 09 (మా అక్షరం): హుజూరాబాద్ మండల స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్‌-14, అండర్‌-17 బాలబాలికల క్రీడా పోటీలు బుధవారం స్థానిక ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని క్రీడా పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించే క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఓటమి ఎదురైనా నిరాశ చెందకుండా, కెరటాల స్ఫూర్తితో పదేపదే లేచి విజయాన్ని అందుకునేందుకు ప్రయత్నించాలని అన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించి పోటీలను విజయవంతం చేయాలని కోరారు. ఎస్‌జీఎఫ్ మండల కార్యదర్శి చిరుత శ్రీనివాస్ మాట్లాడుతూ మూడు రోజులపాటు వివిధ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ పోటీల్లో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. దీంతో క్రీడా మైదానం విద్యార్థుల కేరింతలు, ఉత్సాహంతో సందడిగా మారింది.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, జడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. తిరుమల, మున్సిపల్ కౌన్సిలర్లు కోయల్కర్ భారతి బాలాజీ, ఇల్లందుల సమ్మయ్య, సందమల్ల పుణ్యబాబు, మ్యాకల స్వరూప తిరుపతి, టీజీ పీఈటీ గౌరవ అధ్యక్షుడు సొల్లు సారయ్య, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు వెంకట్‌రెడ్డి, రాజిరెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, హాకీ అసోసియేషన్ కార్యదర్శి బోడిగ తిరుపతి, మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పీడీలు, పీఈటీలు రేణుక, దూడ సత్యనందం, పి. రాజు, భాగ్యలక్ష్మి, కవిత, అనిల్, సాయి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !