హుజురాబాద్/ సెప్టెంబర్ 09(మా అక్షరం): చేనేత కార్మికుల సంక్షేమం, వారి అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో మరింతగా బలోపేతం అవుతోంది.ఇందులో భాగంగా చేనేత సెల్ జిల్లా అధ్యక్షులు బండారి సదానందం ఆదేశాల మేరకు నూతనంగా ఏర్పాటైన చేనేత సెల్ మండల,పట్టణ కమిటీల సభ్యులకు నియోజకవర్గ ఇంచార్జీ ప్రణవ్ బాబు నియామక పత్రాలను అందజేశారు. చేనేత సెల్ మండల అధ్యక్షుడిగా కొమటి సదానందం, ప్రధాన కార్యదర్శిగా దాసి సదానందం,టౌన్ అధ్యక్షుడిగా మార్త రవీందర్,పట్టణ ప్రధాన కార్యదర్శిగా గడ్డం రాఘవేంద్రలు నియామక పత్రాలు అందుకున్నారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ… ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి అందేలా చూస్తామని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని, పట్టణ అధ్యక్షులు మేకల తిరుపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాజీపేట శ్రీనివాస్, సందమల్ల బాబు, చేనేత సంఘం అధ్యక్షులు ఎలిగేటి ఉపేందర్, మండల మహిళా అధ్యక్షురాలు పుల్ల రాధ తదితరులు పాల్గొన్నారు.తమ నియామకానికి సహకరించిన చొప్పదండి ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం, నియోజకవర్గ ఇంచార్జీ ప్రణవ్ బాబు, చేనేత రాష్ట్ర అధ్యక్షులు, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్ తదితర సీనియర్ నాయకులకు నూతన కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.













