హుజూరాబాద్/ సెప్టెంబర్ 11 (మా అక్షరం): గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని జూపాక గ్రామంలో పేద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గ్రామపంచాయతీ సూచించిన 30 మంది పేద వృద్ధ మహిళలకు ట్రస్ట్ నిర్వాహకులు, సామాజిక కార్యకర్త డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్, సర్పంచ్ తాళ్లపల్లి స్వప్న, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షుడు, ఉపసర్పంచ్ జి. మహేందర్ చేతుల మీదుగా చీరలను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్, ఉపసర్పంచ్ మాట్లాడుతూ… మధురమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా గ్రామంలోని వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.కుటుంబ సభ్యులు వృద్ధులకు తగిన సమయం కేటాయించి మానసిక ధైర్యంతో పాటు పోషకాహారం అందించాలని సూచించారు.ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ మధురమ్మ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ప్రభుత్వ రంగ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు సమాజంలోని పేదలకు వివిధ సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చీరలు అందుకున్న వృద్ధ మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మారపల్లి లక్ష్మి, ఇల్లందుల వెంకటేష్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఇనగల సూర్యనారాయణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు













