+91 99635 77856

సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి

-బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం...

హుజురాబాద్/ సెప్టెంబర్ 11 (మా అక్షరం): నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దమనకాండ నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి పొందిన చారిత్రక దినమైన సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా, ఘనంగా నిర్వహించాలని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం డిమాండ్ చేశారు. హుజురాబాద్‌లోని దర్శిని ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, నిజాం పాలన కారణంగా తెలంగాణ ప్రజలు మరో 13 నెలల పాటు నిరంకుశ పాలనలో మగ్గిపోయారని సాయిని మల్లేశం అన్నారు. వేలాది మంది అమరవీరుల త్యాగాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ దృఢ సంకల్పంతో చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని గుర్తుచేశారు.గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకుండా తెలంగాణ చరిత్రను విస్మరించాయని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 17ను ‘ప్రజా పాలన దినోత్సవం’ పేరుతో నిర్వహిస్తూ, తెలంగాణ విమోచన చరిత్రను పక్కన పెడుతోందని ఆరోపించారు.కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల తరహాలో తెలంగాణలోనూ సెప్టెంబర్ 17ను అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రతి ఏటా ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ నిర్వహిస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే స్ఫూర్తితో అధికారికంగా వేడుకలు నిర్వహించాలని కోరారు.ఈ నెల 17న హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంతో పాటు జిల్లాలోని ప్రతి గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రజలకు, బీజేపీ శ్రేణులకు సాయిని మల్లేశం పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్‌రెడ్డి, సీనియర్ నాయకులు కనుమల గణపతి, రావుల భాస్కర్‌రెడ్డి, గంగిశెట్టి రాజు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, మండల అధ్యక్షులు తూర్పాటి రాజు, పారుపల్లి కొండల్‌రెడ్డి, కొలగాని రాజు, దొంతరవేణి రమేష్, ర్యాకం శ్రీనివాస్, కౌన్సిలర్లు కొలుగూరి సుమలత, శీలం శ్రీనివాస్, సర్పంచులు ఉప్పు మహేష్, కుమార్, స్థానిక బీజేపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !