హుజూరాబాద్/ సెప్టెంబర్ 11 (మా అక్షరం): పట్టణంలోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో “వాగ్దేవి ఫియెస్టా–ఫ్రెషర్స్ డే” వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ… విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. పట్టణ సీఐ టి. కరుణాకర్ మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని, సమయపాలన, మంచి నడవడిక విజయానికి పునాది అని అన్నారు.కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ బొక్కల ప్రవీణ్ రెడ్డి, కాకతీయ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. వేణుమాధవ్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం సాంస్కృతిక, క్రీడా, వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.













