హుజురాబాద్ /సెప్టెంబర్ 11 (మా అక్షరం): పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మట్టి వినాయక విగ్రహాలను పూజించి ప్రకృతిని కాపాడాలని మాంటిస్సోరి పాఠశాల ప్రిన్సిపాల్ గీతాషాజు అన్నారు.వినాయక చవితిని పురస్కరించుకొని శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాలలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మట్టి, పిండి పదార్థాలతో స్వయంగా వినాయక విగ్రహాలను తయారు చేసి, అనంతరం వాటిని తల్లిదండ్రులకు అందజేశారు.ఈ సందర్భంగా గీతాషాజు మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతాయని తెలిపారు. మట్టి, సహజ పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చన్నారు. చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో ప్రకృతిపై బాధ్యత, పర్యావరణ స్పృహ పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.













