+91 99635 77856

వినాయక నవరాత్రి ఉత్సవ సమితి అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డి

Kudikala Sai Editor
maaksharamnews.in

వినాయక నవరాత్రి ఉత్సవ సమితి అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డి

హుజూరాబాద్/ సెప్టెంబర్ 11(మా అక్షరం): వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉత్సవ సమితిని శుక్రవారం ఎన్నుకున్నారు. ఉత్సవ సమితి అధ్యక్షుడిగా ఈదులకంటి రవీందర్ రెడ్డిని నియమించినట్లు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సేవ ప్రముఖ కోమళ్ల రాజేందర్ రెడ్డి, రాష్ట్ర గోశాల సంపర్క్ ప్రముఖ రాధాకృష్ణారెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ... తనపై నమ్మకంతో ఉత్సవ సమితి అధ్యక్షుడిగా నియమించిన విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శ్యామ్‌తో పాటు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శ్యామ్, మండల అధ్యక్షుడు కంకణాల రమేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొమురవెల్లి రాజు, పట్టణ కార్యదర్శి కనకం శ్రీనివాస్, నాయకులు గుంటి శ్రీనివాస్, కందుల శ్రీనివాస్ రెడ్డి, అంగీరక ప్రసాద్, కుసుంబ సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

హుజూరాబాద్/ సెప్టెంబర్ 11(మా అక్షరం): వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉత్సవ సమితిని శుక్రవారం ఎన్నుకున్నారు. ఉత్సవ సమితి అధ్యక్షుడిగా ఈదులకంటి రవీందర్ రెడ్డిని నియమించినట్లు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సేవ ప్రముఖ కోమళ్ల రాజేందర్ రెడ్డి, రాష్ట్ర గోశాల సంపర్క్ ప్రముఖ రాధాకృష్ణారెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ… తనపై నమ్మకంతో ఉత్సవ సమితి అధ్యక్షుడిగా నియమించిన విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శ్యామ్‌తో పాటు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శ్యామ్, మండల అధ్యక్షుడు కంకణాల రమేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొమురవెల్లి రాజు, పట్టణ కార్యదర్శి కనకం శ్రీనివాస్, నాయకులు గుంటి శ్రీనివాస్, కందుల శ్రీనివాస్ రెడ్డి, అంగీరక ప్రసాద్, కుసుంబ సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !