+91 99635 77856

స్నేహబంధానికి సరికొత్త చిరునామా.. మిత్రుడి కుటుంబానికి ఆపన్నహస్తం

Kudikala Sai Editor
maaksharamnews.in

స్నేహబంధానికి సరికొత్త చిరునామా.. మిత్రుడి కుటుంబానికి ఆపన్నహస్తం

-1990 టెన్త్ బ్యాచ్ స్నేహితుల రూ.40 వేల ఆర్థిక సహాయం...

హుజూరాబాద్/సెప్టెంబర్ 12 (మా అక్షరం):చిన్ననాటి స్నేహం.. కాలం గడిచినా చెదరని అనుబంధం.. కష్టకాలంలో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచి 1990 టెన్త్ బ్యాచ్ స్నేహితులు మానవత్వాన్ని చాటుకున్నారు.పట్టణంలోని క్రింది వాడకు చెందిన తమ సహచరుడు ముల్కనూరి సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి తోటి మిత్రులు ఆపన్నహస్తం అందించారు. మిత్రుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు బ్యాచ్‌కు చెందిన స్నేహితులు తమ వంతుగా రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.సత్యనారాయణ అకాల మరణం పట్ల వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న తమ స్నేహబంధానికి గుర్తుగా, కష్టకాలంలో మిత్రుడి కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావించి ఈ సహాయం అందించినట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ కుటుంబానికి తమ సహకారం కొనసాగిస్తామని పేర్కొన్నారు.సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని మిత్రులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గంగిశెట్టి రతన్ ప్రసాద్, నంబి భరణి కుమార్, ముప్పిడి నాగరాజు, అపరాజ ప్రసాద్, తాళ్లపెల్లి శ్రీనివాస్, భూసారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-1990 టెన్త్ బ్యాచ్ స్నేహితుల రూ.40 వేల ఆర్థిక సహాయం…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !