+91 99635 77856

ప్రకృతి పరిరక్షణతోనే భావితరాలకు భద్రమైన భవిష్యత్తు

Kudikala Sai Editor
maaksharamnews.in

ప్రకృతి పరిరక్షణతోనే భావితరాలకు భద్రమైన భవిష్యత్తు

-మట్టి వినాయకులనే ప్రతిష్ఠించాలి.. నీరు, విద్యుత్, ఆహారం వృథా చేయొద్దు...

-ప్రతి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవానికి ఒక మొక్క నాటాలి: కౌన్సిలర్ వర్ధినేని రవీందర్‌రావు...

హుజురాబాద్, సెప్టెంబర్ 13 (మా అక్షరం):ప్రకృతి పరిరక్షణ, ప్రజా సంక్షేమం, సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరి కర్తవ్యమని 12వ మున్సిపల్ కౌన్సిలర్ వర్ధినేని రవీందర్‌రావు అన్నారు. సమాజంలో మార్పు ప్రభుత్వాలతోనే సాధ్యం కాదని, ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా వ్యవహరించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.వినాయక చవితి సందర్భంగా పీఓపీ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని ఆయన కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నీరు, విద్యుత్, ఆహారం వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పెట్రోల్, డీజిల్‌ను కూడా అవసరానికి మించి వినియోగించకుండా పొదుపు చేయాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణలోని అనేక గ్రామాల్లో పగటి సమయంలోనూ వీధి దీపాలు వెలుగుతున్నాయని, విద్యుత్ వృథాను అరికట్టేందుకు స్ట్రీట్ లైట్లకు ఆటోమేటిక్ స్విచ్ కంట్రోల్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రమాదాల నివారణకు అన్ని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.కరీంనగర్–వరంగల్ మధ్య కాకతీయ కాలువలో పెద్ద చెట్లు, తుమ్మ చెట్లు విపరీతంగా పెరిగి కాలువ లైనింగ్‌కు నష్టం కలిగించే పరిస్థితి ఉందని రవీందర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాలువల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకుని చెట్లను, పొదలను తొలగించాలని కోరారు.హుజురాబాద్ మున్సిపాలిటీతో పాటు అన్ని గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా వాటర్ ట్యాప్స్ ఏర్పాటు చేసి నీటి వృథాను అరికట్టాలని అన్నారు. విద్య, వైద్యం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రతి వ్యక్తి తన పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం వంటి ప్రత్యేక సందర్భాల్లో కనీసం ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించే అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మనిషిగా జన్మించడం అరుదైన అవకాశమని, ప్రతిరోజూ వీలైనంత వరకు సాటి మనిషికి సహాయం చేయాలని సూచించారు.ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, డబ్బులు, ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రవీందర్‌రావు కోరారు. రాజకీయ వ్యవస్థలో అవినీతి, విలువల క్షీణతపై ప్రజల్లో ఆందోళన ఉందని, రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసు, ఐఏఎస్ అధికారులు, న్యాయవ్యవస్థలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించాలని అన్నారు.ప్రకృతి పరిరక్షణ నుంచి ప్రజాస్వామ్య విలువల వరకు ప్రతి అంశంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, సమాజం కోసం ప్రతి ఒక్కరూ రోజూ ఒక మంచి పని చేయాలన్నదే తన ఆకాంక్ష అని రవీందర్‌రావు పేర్కొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-మట్టి వినాయకులనే ప్రతిష్ఠించాలి.. నీరు, విద్యుత్, ఆహారం వృథా చేయొద్దు…

-ప్రతి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవానికి ఒక మొక్క నాటాలి: కౌన్సిలర్ వర్ధినేని రవీందర్‌రావు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !