+91 99635 77856

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్ పంజాల 

Kudikala Sai Editor
maaksharamnews.in

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్ పంజాల 

హుజురాబాద్/ సెప్టెంబర్13(మా అక్షరం): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చి మాటకు కట్టుబడి నిలిచారు మున్సిపల్ కౌన్సిలర్ పంజాల మనోజ్ (బంటి) 21వ వార్డులో విఘ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా మండపాన్ని నిర్మించి వార్డు ప్రజల ప్రశంసలు అందుకున్నారు.మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో 21వ వార్డు ప్రజలు వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు మండపం నిర్మించాలని కౌన్సిలర్ మనోజ్‌ను కోరారు. ప్రజల కోరికను స్వీకరించిన ఆయన, ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం రానున్న విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలకు మండపం నిర్మిస్తానని హామీ ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం నేడు మండప నిర్మాణాన్ని పూర్తి చేయించడంతో “మాట ఇస్తే నిలబెట్టుకోవాలి.. ప్రజల అవసరాలకు అండగా ఉండాలి” అన్న నమ్మకాన్ని కౌన్సిలర్ మనోజ్ నిలబెట్టుకున్నారని వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కొల్లూరి మధుకర్, చిదురాల హేమలత, కొత్తకొండ శంకర్, బొల్లు మహేందర్, చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, మిల్కూరి రమ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !