– 37 సంవత్సరాల తర్వాత కలుసుకున్న.. పూర్వ విద్యార్థులు…
-ప్రభుత్వ హై స్కూల్లో 1989 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సందడి…
హుజురాబాద్/ సెప్టెంబర్ 13( మా అక్షరం): పట్టణం లోని మధువని గార్డెన్ లో ఆదివారం స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో 1989 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి ఆనాటి ఉపాధ్యాయులతో పాటు సుమారు 150 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. తాము చదువుకున్న పాఠశాలను సందర్శించి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. నాటి ఉపాధ్యాయులను ఆహ్వానించి ఘనంగా స్వాగతం పలకడంతో పాటు ఘనంగా సన్మానించారు. నాటి ప్రభుత్వ హైస్కూలు ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే తాము ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డామని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో పాఠశాలను పరిరక్షించడంతోపాటు, పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు పూర్వ విద్యార్థులు తెలిపారు. 37 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులను కలుసుకోవడం సంతోషంగా ఉందని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. భవిష్యత్తులోనూ ఇలాగే సమావేశాలు నిర్వహించుకోవాలని పాఠశాల అభివృద్ధికి సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. నాడు ప్రభుత్వ పాఠశాలను ఒక ప్రైవేటు పాఠశాల లాగా నడిపించారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేశారని, నేడు అన్ని రంగాల్లో విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు ఆలేటి మదన్ మోహన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, కవ్వ లక్ష్మారెడ్డి, గూడూరు మల్లారెడ్డి, గుజ్జుల నారాయణరెడ్డి, దొనకొండ ప్రభాకర్ రెడ్డి, రాధా కిషన్ పాల్గొన్నారు. 1989 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు శనిగరపు నరేందర్, గోలి సురేష్, పోన్నోజు సంతోష్ కుమార్, అనుముల ప్రవీణ్ శర్మ, అక్కినపల్లి అనిల్ కుమార్ తదితరులు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.కార్యక్రమానికి సమన్వయకర్తలుగా బొమ్మ కంటి మురళీధర్, కొల్లూరు అనిల్ కుమార్ వ్యవహరించారు.













